తండ్రిని అడ్డుపెట్టుకొని భారీగా అవినీతి చేశారు: జ‌గ‌న్‌పై ఎమ్మెల్యే ధూళిపాళ్ల ఆరోప‌ణ‌లు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డిపై టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ రోజు గుంటూరులో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ..  నిన్న సుద్ద‌ప‌ల్లిలో జ‌గ‌న్ చేసిన వ్యాఖ్య‌లు అర్థ‌ర‌హితమని, రాష్ట్రాభివృద్ధిని అడ్డుకోవ‌డ‌మే జగన్ ల‌క్ష్యంగా పెట్టుకొని పర్యటలను జరుపుతున్నారని విమర్శించారు. భారీగా అవినీతికి పాల్పడిన జగ‌న్.. ప్రభుత్వంపై అనవసర విమర్శలు చేస్తున్నారని ఆయన అన్నారు. ఓబులాపురంలో జ‌గ‌న్ మైనింగ్ ధ‌న‌దాహానికి ఐఏఎస్ అధికారిణి శ్రీల‌క్ష్మి బ‌లైందని అన్నారు.  తండ్రిని అడ్డుపెట్టుకొని జగన్ భారీగా అవినీతి చేశారని ఆయన ఆరోప‌ణ‌లు చేశారు.
Go Back to Shorts
dhulipalla

More Telugu News